SRD: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులోని కార్యాలయంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..ఈ పండగ న్యాయవాదుల జీవితాల్లో విజయాలు కలిగించాలని దుర్గామాతను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేష్, కార్యవర్గ సభ్యులు మంజులారెడ్డి, శ్రీకాంత్, బుచ్చయ్య పాల్గొన్నారు.