GNTR: అన్న క్యాంటీన్లలో ఆహార సరఫరా సమయాల్లో వార్డు, సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం అమరావతి రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.