NRML: దివ్యాంగులు సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్లో నిర్వహించే సదరం శిబిరం తేదీలను సోమవారం ప్రకటించారు. 7వ తేదీ నుండి 30వ తేదీ వరకు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని కంటి చూపు, ఆర్థో పెడిక్, వినికిడి లోపం ఉన్నవారు స్లాట్ బుక్ చేసుకొని మొబైల్కు సమాచారం వచ్చిన వారందరూ నిర్దేశించిన కేంద్రంలో పరీక్షలు జరుపుకోవాలని తెలిపారు.