ATP: రాప్తాడు TDP కార్యాలయంలో TDP ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి నరేశ్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పై మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే సునీతకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఈ నెల 25న ఆయన ఇంటిని ముట్టడిస్తామన్నారు.