కృష్ణా: గుడివాడ పట్టణంలోని రైల్వే గేట్లపై నిర్మితమవుతున్న భారీ ఫ్లెఓవర్కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు పెట్టాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు గ్రీవెన్స్‌లో భాగంగా గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యంకు బాలశౌరి అభిమానులు దాసరి మహేష్, మణికుమార్, దినేష్ కన్నా సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు.