PLD: కూటమి ప్రభుత్వ బెదిరింపులకు వైసీపీ కార్యకర్తలు భయపడరని జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్.ప్రసాద్ అన్నారు. సోమవారం వినుకొండలో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు లేవనెత్తిన చెరువుల అన్యాక్రాంతం అంశానికి సమాధానం చెప్పకుండా టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. జిల్లాలో కూటమి పాలనలో శాంతి భద్రతలు లోపించాయని పేర్కొన్నారు.