బాపట్ల: జిల్లాలో జల సంరక్షణ ప్రణాళిక అమలుపై ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లకు సోమవారం మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విస్తరణ శిక్షణ కేంద్రంలో జరిగిన ప్రారంభ సభలో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు. ప్రతి ఇంజినీర్ నీటి సంరక్షణ పద్ధతులు, ప్రణాళికల రూపకల్పనపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, జిల్లాలో నీటి వనరుల మెరుగుదలకు కృషి ఆయన సూచించారు.