MLG: మల్లంపల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన దుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని మంత్రి సీతక్క సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ ప్రారంభం సంతోషకరమని, ప్రజా ప్రభుత్వంలో ములుగు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తోందని సీతక్క తెలిపారు.