TG: ఫీజు రియింబర్స్మెంట్ బకాయిల కోసం రాష్ట్రంలో రెండో రోజూ ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు భారీగా చేరుకోవడంతో.. పోలీసులు మోహరించారు.