BDK: కొత్తగూడెంలో ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనున్న ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని టూ టౌన్ సీఐ ప్రతాప్ ఇవాళ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. రాజీకి అనుకూలమైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబపరమైన సమస్యలు, వైవాహిక వివాదాలు, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, అదాలత్లో పరిష్కారం అవుతాయని తెలిపారు.