ELR: మినీ బైపాస్ రోడ్డులో గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదలు ఇటీవల భారీ వర్షాల వలన ఉపాధి కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇవాళ వారిని పరామర్శించి, ఒక్కొక్కరికీ రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి, భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తుఫాన్‌తో నష్టపోయిన వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.