ATP: పవిత్ర కార్తీక మాసం పుణ్యక్షేత్రాలలో రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. “జై ఆంజనేయ” నినాదాలతో మారుమ్రోగిన ఈ ఉత్సవం భక్తి పరంపరలకు ప్రతీకగా నిలిచిందని ఆయన అన్నారు. స్వామి ఆశీర్వాదంతో గ్రామం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.