ప్రకాశం: ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్ సంకల్ప అభయాన్ పిలుపు మేరకు, స్వదేశీ వస్తువుల కొనుగోలు ఆవశ్యకతను కనిగిరి పట్టణ అధ్యక్షుడు బీజేపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ప్రచారం చేపట్టారు. పట్టణంలోని షాపుల్లో, ఇళ్లల్లో స్టిక్కర్లు అంటించి, కరపత్రాల ద్వారా ప్రచారం చేపట్టారు. స్వదేశంలో తయారుచేసిన వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు.