విశాఖ: ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరి రోజు కావడంతో ఎక్కువ మంది ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చారు.