AP: సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్ పర్సన్ నారా భువనేశ్వరి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో ఆమె రెండు పురస్కారాలను స్వీకరించారు. IOD సంస్థ ఆమెకు ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ను ప్రదానం చేయగా, హెరిటేడ్ ఫుడ్స్‌కు లభించిన ‘గోల్డెన్ ఫికాక్’ అవార్డును కూడా అందుకున్నారు. కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు.