SKLM: జి.సిగడాం మండలం ఎందువ గ్రామంలో జరగనున్న కైలాసగిరి ప్రదక్షిణకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని డీఎస్పీ CH. వివేకానంద తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో సమావేశమై ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.