TG: పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి అందించే ధరలను పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ. 5.45ను రూ. 6.19కి, ప్రాథమికోన్నత స్కూళ్లలో రూ. 8.17 నుంచి రూ. 9.29కి పెంచింది. 9, 10వ తరగతుల విద్యార్థులకు రూ. 10.67 నుంచి రూ. 11.79కి పెంచింది.