GNTR: తెనాలి మండలం కఠెవరం పంచాయతీ పరిధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న షేక్ గపూర్, అతని రెండవ భార్య దుర్గా భవానీని పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్ఐ ఆనంద్ వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన ఓ మహిళకు డబ్బు ఆశ చూపి ఆమెతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్నారు. ‘పక్కా సమాచారంతో దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశాం.. కోర్టుకు తరలించగా.. 14 రోజులు రిమాండ్ విధించింది’ అని ఎస్ఐ వెల్లడించారు.