NZB: భీమ్గల్ లింబాద్రి గుట్ట శ్రీవారి లక్షలాది భక్తుల నిరీక్షణకు సమయం ఆసన్నమైంది. శ్రీమన్నింబాచలుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకలో చుట్టూ పక్కల గ్రామాల భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పాల్గొంటారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.