TG: రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల చేరిన మంత్రి అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ వెల్ఫేర్ శాఖలను ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల శాఖ గతంలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉండేది. మైనార్టీ సంక్షేమశాఖను గతంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్వహించేవారు.