NZB: బోధన్ పట్టణంలోని శ్రీ పార్వతీ సమేత చక్రేశ్వరాలయంలో మంగళవారం రోజున ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో షామియానాలు వేసి 108 జంటలకు పూజా సామాగ్రి ఆలయం నుంచి అందించి ఏర్పాట్లు చేశారు. పూజలో 72 జంటలు పాల్గొన్నారు. పూజలలో పాల్గొన్న జంటలకు సంజీవరెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.