SDPT: జగదేవపూర్ మండలం జంగారెడ్డి పల్లెలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గజ్వేల్‌కు చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం రామకోటి రామరాజుకు ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.