MNCL: బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రకృతి రమణీయమైన పవిత్రమైన పుణ్యస్థలమని ఏసీపీ రవికుమార్ అన్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి మండలం కన్నాల పరిధిలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. 3 గుట్టల నడుమ స్వచ్చమైన పచ్చని చెట్ల మధ్య వెలసిన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైందన్నారు.