MBNR: జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో యాదవ సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆంజనేయస్వామి దేవాలయం వద్ద శ్రీకృష్ణ భగవానునికి మరియు దున్నపోతులకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద గొల్ల వెంకటేష్ మాట్లాడుతూ “సదర్ పండుగ యాదవుల ఐక్యతకు ప్రతీక” అని, కుల మత భేదాలు లేకుండా దున్నపోతులను ఎగిరియడం ద్వారా సదర్ పండుగను ఆనందంగా జరుపుకున్నామని తెలిపారు.