JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో కరికొండ లక్ష్మీ నృసింహస్వామి జాతర బుధవారం ఘనంగా నిర్వహించారు. గుట్టపై ఉన్న దేవాలయంలో భక్తులు పూజలు చేసేందుకు బారులు తీరారు. దేవాలయం ఆవరణలో యజ్ఞం చేశారు. భక్తులు టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. ఈ ఉత్సవాల్లో అర్చకుడు రవీందర్, నాయకులు, యువకులు పాల్గొన్నారు.