NLG: చిట్యాల మండల రజక వృత్తిదారుల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రుద్రారపు పెద్దులు, ప్రధాన కార్యదర్శిగా ఐతరాజు యాదయ్యలు ఎన్నికయ్యారు. చిట్యాలలో జరిగిన రజక వృత్తిదారుల సంఘం మండల మహాసభలో నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిట్యాలలో అసంపూర్తిగా ఉన్న మోడ్రన్ ధోబీ ఘాట్ పనులను పూర్తి చేయాలని కోరారు.