కోనసీమ: ఆలమూరు మండలం జొన్నాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆగిన నిర్మాణ పనులను కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు చేశారు. కలెక్టర్ మహేష్ వెంట కొత్తపేట ఆర్డీవో శ్రీకర్, ఆలమూరు ఎమ్మార్వో ప్రకాష్ బాబు, ఎంపీడీవో రాజు పాల్గొన్నారు.