SKLM: ఆమదాలవలస మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో రబీ పంటకు రాయితీ కింద పెసర, మినుము, కట్టె జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏవో మెట్ట మోహన్ రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.పెసలు 6.16 క్వింటాలు, మినుములు 8.24 క్వింటాలు, కట్టె జనుము 24.3 క్వింటాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. విత్తనాలు కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు.