SKLM: పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కారిడార్ పనులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పనులు పూర్తయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అలాగే తుఫాను బాధితులకు పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.