ప్రకాశం: గిద్దలూరులో రూరల్ సీఐ రామకోటయ్య ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్, రహదారి భద్రత వంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలని సీఐ రామకోటయ్య అన్నారు.