ASR: కాఫీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు బుధవారం పాడేరులో డిమాండ్ చేశారు. కార్మికులకు రోజువారీ వేతనాలు పెంచాలని, ప్లాంటేషన్ కండక్టర్లను నియమించాలని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కానీ పట్టించుకోలేదన్నారు. దీంతో రేపటి నుంచి సమ్మె చేపడతామన్నారు. డీఎం ఆఫీసుల ముందు ఆందోళన చేస్తామని తెలిపారు.