PLD: గురజాల మండలం దైద బిలంలో ఇవాళ కార్తీక పౌర్ణమి పూజలలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కృష్ణా నది పక్కనే కొండ బిలంలోని అమరలింగేశ్వర స్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అర్చకులు యరపతినేనికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.