kKD: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకినాడ జిల్లాలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ ఏడీ ఎ.వై. శ్రీనివాసు తెలిపారు. బుధవారం ఆయన కాకినాడలో మాట్లాడారు. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 25వ తేదీ లోపు ఆన్లైన్ వెబ్సైట్ www.apdascac.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.