సత్యసాయి: చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఇవాళ ఆకస్మిక సోదాలు నిర్వహించారు. కార్యాలయ తలుపులు మూసివేసి రికార్డులు, లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. అవినీతికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సిబ్బంది పనితీరుపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.