W.G: కాళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థుల భోజనం కోసం బుధవారం సరఫరా చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయాయి. వంట చేస్తుండగా గుడ్లు రంగు మారి దుర్వాసన వచ్చింది. విషయం తెలుసుకున్న విద్యాశాఖ సిబ్బంది గుడ్లను తినకుండా ఆపడంతో ప్రమాదం తప్పింది. గుడ్ల విషయాన్ని టీచర్లకు తెలిపినా పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.