ADB: బీఆర్ఎస్, బీజీపీ పార్టీలు ఇస్తున్న హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఆమె హాజరై మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.