TG: సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేనపై విద్యాసంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రవేటు కాలేజీలను దేవసేన బెదిరిస్తున్నారని, ఆయనను విద్యాశాఖ నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘నిన్న ప్రభుత్వం చర్చలకు పిలిచి ఏమీ చెప్పలేదు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుపై నిన్న కమిటీ వేశారు. సంబంధం లేని ఇద్దరు వ్యక్తులను తొలిగించాలి’ అని ఉన్నత విద్యాసంస్థ సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు పేర్కొన్నారు.