NRML: విద్యార్థులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకునేందుకు ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. గురువారం సోన్ మండలం పాక్ పట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలను, తరగతి గదులను, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు.