SRCL: పంచాయతీ రాజ్ (పీఆర్) ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో విద్యా శాఖ, పంచాయతీ, అంగన్వాడీ, ఆరోగ్య శాఖ భవనాలు, ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద జిల్లాలో మొదలు పెట్టిన పనులపై వివిధ శాఖల, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సమీక్ష నిర్వహించారు.