సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తిలోని చిత్రావతి నది తీరాన్ని సుందరీకరించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా చిత్రావతి నది తీరంలో ఉన్న హారతి ఘాట్ సమీపంలోని నివాసాల తొలగింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. నదీ తీరాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.