MNCL:తాండూర్ మండలం అచలాపూర్ ఉన్నత పాఠశాలలో SGF ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి అండర్-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ కం సెలక్షన్స్ గురువారం నిర్వహించారు. టోర్నమెంట్లో మొదటి స్థానం నిర్మల్ జట్టు, 2వ స్థానంలో ఆసిఫాబాద్ నిలిచాయని PET సాంబమూర్తి తెలిపారు. ఇక్కడ ఎంపికైన జట్టు ఈనెల 8 నుండి 10 వరకు బయ్యారంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు.