GNTR: కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసని శంకరరావు నవంబర్ 9న విజయవాడలో రాష్ట్ర విస్తృత స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన మంగళవారం గుంటూరు కార్యాలయంలో మాట్లాడుతూ.. 2026 స్థానిక ఎన్నికల కంటే ముందు కుల గణన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.