ADB: ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఈ నెల 7 నుంచి ప్రారంభిస్తామని నిర్వాహకుడు రాష్ట్రపాల్ తెలిపారు. గతంలో కురిసిన వర్షంతో స్విమ్మింగ్ పూల్ నీరు కలుషితమైందని.. వాటిని పూర్తిస్థాయిలో తొలగించి కొత్తనీరు నింపామన్నారు. మంగళవారం నుంచి యథావిధిగా పూల్ ఓపెన్ ఉంటుందని, ప్రజలు గమనించాలని కోరారు.