గుంటూరు జిల్లాలో బేల్దారి పనులు చేసుకుంటూ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ గురజాలకు చెందిన బొప్పూరి మల్లిఖార్జున రావును కొత్తపేట పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన 50 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బైక్లను పల్నాడు జిల్లాలోని పరిచయస్తులకు అమ్మినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు.