అన్నమయ్య: నకిలీ మద్యం తయారీపై మదనపల్లె వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్ విమర్శలు గుప్పించారు. ఇవాళ పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ.. మొలకలచెరువులో టీడీపీ నాయకుల కనుషన్నల్లో జరిగిన మద్యం తయారీ పై ఏమి సమాధానం చెబుతారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. అనంతరం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.