SKLM: కొత్తూరు మండలం కర్లమ్మ గ్రామానికి చెందిన లక్ష్మీకాంతం, ఉమామహేశ్వరులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను సోమవారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మాతల గాంధీ, తదితరులు ఉన్నారు.