KMM: ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిష్టాపురంలోని సోమవారం అకస్మాత్తుగా వర్షం కురవడంతో హైస్కూల్లోని గిన్నెపండు చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడి నిలువుగా చీలిన చెట్టు. దీంతో ఒక్కసారిగా హైస్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు. ఆ సమయంలో హైస్కూల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.