KMM: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ పడ్డదో బాకీ కార్డు ద్వారా తెలియజేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. సోమవారం పెనుబల్లిలో జరిగిన మండల నాయకుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడగటానికి వస్తే ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలని ఆయన సూచించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు.