BDK: జూలూరుపాడు మండల సీపీఐ సీనియర్ నాయకులు వల్ల పిన్ని సత్యనారాయణ మరణం బాధాకరమని MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామని, వారి కుటుంబానికి సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. సోమవారం కొత్తూరు గ్రామంలో జరిగిన దశదిన కార్యక్రమానికి సాంబశివరావు హాజరయ్యారు.