MHBD: బయ్యారం మండలం మోట్లగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రుల ముందు వాపోయారు. అనంతరం చిన్నారులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ‘మా పిల్లలకు గురువులు కావాలి’ అనే నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనకు DSFI నాయకులు మద్దతు తెలిపారు.